ఏపీలో పలు చోట్ల స్వల్పంగా భూ ప్రకంపనలు
- August 13, 2022
అమరావతి: ఏపీలో పలు చోట్ల స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి.నెల్లూరు జిల్లా ఉదయగిరి, వింజమూరు, కొండాపురం, వరికుంటపాడు, దుత్తలూరు మండలాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.అనేక గ్రామాల్లో రెండు సెకన్లపాటు భూమి కంపించినట్టు గుర్తించారు. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. అలాగే ప్రకాశం జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. గత నెలలో కూడా ఇదే ప్రాంతాల్లో భూమి కంపంచింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
ప్రకాశం జిల్లాలోని పామూరు మండలం రామగోపాలపురం, బోట్లగూడూరు, పామూరు టౌన్ లో భూ ప్రకంపనలు సంభించాయి.మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇళ్లు స్వల్పంగా కుదుపులకు గురికావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆరుబయట ఉండాలని అధికారులు సూచించారు. భవంతులు, భారీ చెట్ల దగ్గర ఉండవద్దని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







