రావ్దా షరీఫ్ ప్రార్థనలకు కొత్త నిబంధనలు

- August 14, 2022 , by Maagulf
రావ్దా షరీఫ్ ప్రార్థనలకు కొత్త నిబంధనలు

మదీనా : మదీనాలోని ప్రవక్త మస్జీదులోని రౌదా షరీఫ్‌లో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఆరాధకులు ఉండేందుకు అనుమతి ఉందని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ తెలిపింది. తవక్కల్నా లేదా ఈటమర్నా దరఖాస్తుల ద్వారా యాత్రికులకు అనుమతిని జారీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మక్కాలోని గ్రేట్ మస్జీదులో ఉమ్రా/ ప్రార్థనలు చేయడానికి 1443 AH చివరి సీజన్‌లో 70 మిలియన్లకు పైగా అనుమతులు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రతినిధి హిషామ్ సయీద్ తెలిపారు. సౌదీ పౌరులు, నివాసితులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలు (GCC) పౌరులు లేదా వివిధ రకాల వీసాలు ఉన్నవారు అయినా  రౌదా షరీఫ్‌లో ఉమ్రా లేదా ప్రార్థన నిర్వహించాలనుకునే వారందరికి ఇప్పుడు టైమ్ స్లాట్లతో కూడిన అనుమతులను జారీ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com