కేవలం 200 దిర్హములు షాపింగ్ చేసి..1 మిలియన్ దిర్హమ్లు గెలుచుకుంది..
- August 14, 2022
అబుధాబి: రిటైల్ దిగ్గజం లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ తన ‘మాల్ మిలియనీర్’ ప్రచారంలో భాగంగా నిర్వహించిన డిజిటల్ డ్రాలో అబుధాబిలో నివాసముంటున్న తమిళనాడుకు చెందిన సెల్వరాణి డేనియల్ జోసెఫ్..1 మిలియన్ దిర్హమ్లను గెలుచుకుంది.
ఆమెకు ఇద్దరు పిల్లలు భర్తతో కలిసి అబుధాబిలో నివాసం ఉంటున్నారు.ఆ మహిళను తాజాగా అదృష్టం వరించింది.కేవలం 200 దిర్హములు షాపింగ్ చేసి..1 మిలియన్ దిర్హమ్లు గెటుచుకున్నారు.ఈ క్రమంలో ఆమెతోపాటు కుటుంబ సభ్యులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై లులు గ్రూప్ సంస్థల అధినేత ఎం.ఏ యూసుఫ్ అలీకి సంబంధించిన షాపింగ్స్ మాల్స్ యూఏఈ వ్యాప్తంగా అనేకం ఉన్నాయి.ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అబుధాబిలో లులు మాల్స్ పేరుతో ఉన్న షాపింగ్ మాల్స్.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మొదటి వారం వరకు ‘మాల్ మిలియనీర్’ క్యాంపెయిన్‌ను నిర్వహించాయి. 200 దిర్హమ్లు ఖర్చు చేసి..ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్న కస్టమర్లకు..లక్కీ డ్రాలో ఒక మిలియన్ దిర్హమ్లను గెలుచుకునే అవకాశం కల్పించాయి.
ఈ నేపథ్యంలోనే భర్త, పిల్లలతోపాటు అబుధాబిలో నివసిస్తున్న తమిళనాడుకు చెందిన సెల్వరాణి డేనియల్ జోసెఫ్..ఈ క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.కాగా..తాజాగా నిర్వహించిన డ్రాలో ఆమెకు లభించిన కూపన్‌కు నెంబర్‌కు జాక్‌పాట్ తగిలింది.ఏకంగా 1 మిలియన్ దిర్హమ్లు గెలుచుకున్నారు.ఈ విషయం తెలిసి ఆమె భర్త సహా ఇతర కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.సెల్వరాణి కొద్ది రోజుల క్రితం తన స్వగ్రామానికి వచ్చినందువల్ల.. ఆమె భర్త ఆ మొత్తానికి సంబంధించిన చెక్‌ను అందుకున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







