కువైట్ లో కడప జిల్లా వాసికి 'తెలుగు దేశం-కువైట్' ఆర్ధిక సాయం

- April 14, 2016 , by Maagulf

  కడప జిల్లా రైల్వే కోడూరు వాసి యామల చంద్రయ్య కుటుంబం ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి లో నివాసం ఉంటుంది. కువైట్ లో భవన కార్మికుని గా పనిచేస్తూ గుండె సంబదిత వ్యాదితో అకాల మృత్యువాత పడ్డాడు. ఇతని వయసు 49 సంవత్సరాలు. ఇతనికి ఇద్దరు పిల్లలు. పేద కుటుంబం నుండి వచ్చిన చంద్రయ్య మరణం తో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.
చంద్రయ్య మరణ వార్తను తెలుసుకొన్న నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసన సభ్యులు శ్రీ కురుగుంట్ల రామకృష్ణ నాయుడు గారు తెలుగుదేశం-కువైట్ వారితో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించడాని కావలిసిన ఏర్పాట్లు చెయ్యవలసిందిగా కోరారు.
నెల్లూరు జిల్లా వేంకటగిరి శాసన సభ్యులు శ్రీ కురుగుంట్ల రామకృష్ణ నాయుడు అభ్యర్ధన మేరకు కువైట్ తెలుగుదేశం సేవా విభాగం మృతదేహం ఇంటికి చేర్చుటకు కావలసిన డాక్యుమెంటేషన్ ను పూర్తి చేసి, దగ్గరుండి మృతదేహాన్ని ఎయిర్ పోర్ట్ కు తరలించారు. పెద్దదిక్కు కోల్పోయిన కుటుంబానికి తమవంతు సాయంగా 200000 (రెండులక్షల రూపాయలు)ఆర్ధిక సాయాన్ని కూడా అందించారు. 
200000 (రెండులక్షల రూపాయలు) చెక్కును మృతిని బందువుకు  అందచేసారు. ఈ సందర్భంగా  మృతదేహాన్ని ఇండియా కు తరలించడానికి కువైట్ లోని ఇండియన్ ఎంబసి తమ పూర్తి సహాయ సహకారాలు అందించినది. మృతదేహాన్ని ఇండియా కు తరలించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఆర్ధిక సహాయం చేసిన తెలుగుదేశం-కువైట్ గౌరవ సలహాదారులు  శ్రీ రావెల్ల సుబ్బారాయుడు(బాబు నాయుడు), కాపెర్ల పట్టాభి రాము నాయుడు,  నల్లాని సురేష్ నాయుడు అధ్యక్షులు శ్రీ కుదరవల్లి సుధాకర రావు, మరియు ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయుడు వేగి గార్లను నెల్లూరు జిల్లా వేంకటగిరి శాసన సభ్యులు శ్రీ కురుగుంట్ల రామకృష్ణ నాయుడు గారు అభినందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com