-: మాన్యులు - సామాన్యులు :-

రోజులు మారాయి,

రాజులు మారారు,

రోగాలు ముసిరాయి

రాగాల దోమలు ముదిరాయి!

 

విరోధాలు పెరిగాయి,

అవరోధాలు, ఆత్మహత్యలు అధికమయ్యాయి,

ఊరినిండా ఉన్మాదులు, 'ఉరి'తాళ్ళు వెతుకుతున్నారు

అర్ధాలకు పెడర్ధాలు పెరిగాయి

స్వార్ధాలు పరాకాష్టకు చేరుతున్నాయి!

 

మనలో విజ్ఞానం కొంత పెరిగితే

జ్ఞాన సూన్యులు మరింత పెరిగారు!

మాన్యులైన వారు మౌన ముద్ర పాటిస్తే

సామాన్యుల సంగతి సగం మునిగినట్టె!

అన్నాడొక అభాగ్య జ్ఞానీ!

ఎదయ, మీదయ

మామీదలేదయా!

మాన్యులు సామాన్యులు మనుషులేనయ్యా

మనుగడ కోసం, ధాన్య కోసం

ధనం కోసం ప్రకులాడటం తప్ప

మరోప్రపంచం, మరోదారి లేవు!

 

రోజులు మారాయి, రాజులు మారారు

మన తలరాతలు మారలేదు మహాత్మా!

 

--డా.కోడి రామా రావు(అల్ ఐన్)

Back to Top