ఐఎస్బీలో ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- August 17, 2022
బహ్రెయిన్: భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ (ISB) లో ఘనంగా జరిగాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాల చారిత్రక మైలురాయిని గుర్తుచేసుకోవడానికి మార్చి 2021లో భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ISB గౌరవాధ్యక్షుడు ప్రిన్స్ ఎస్ నటరాజన్ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఇసా టౌన్ క్యాంపస్‌లో జరిగిన వేడుకలకు కార్యదర్శి సాజి ఆంటోని, విద్యావేత్తలు మహ్మద్ ఖుర్షీద్ ఆలం, యాక్టింగ్ ప్రిన్సిపల్ వినోద్ ఎస్, రిఫా క్యాంపస్ యాక్టింగ్ ప్రిన్సిపల్ లీలా వ్యాస్, సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







