హాస్పిటల్‌లో క్యాష్‌లెస్‌ సౌకర్యం

- April 14, 2016 , by Maagulf
హాస్పిటల్‌లో క్యాష్‌లెస్‌ సౌకర్యం

హమాద్‌ మెడికల్‌ కార్పొరేషన్‌, కొత్త క్యాష్‌లెస్‌ పేమెంట్‌ సిస్టమ్‌ని ఔట్‌ పేషెంట్‌ అపాయింట్‌మెంట్స్‌ కోసం విమెన్స్‌ హాస్పిటల్‌లో ఏర్పాట్లు చేసింది. క్రెడిట్‌, డెబిట్‌ లేదా ఇ-క్యాష్‌ కార్డ్‌ ద్వారా ఔట్‌ పేషెంట్లు అపాయింట్‌మెంట్‌ పొందవచ్చు. ఖతార్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 20 ఖతారీ రియాల్స్‌కి న్యూ కార్డ్‌ (ఇ-క్యాష్‌ కార్డ్‌) లభిస్తుంది. ఆపైన, టాపప్‌ చేయించుకోవచ్చు. ఇది ప్రభుత్వ సర్వీసులను వినియోగించుకునేందుకూ ఉపయోగపడుతుంది. క్యాషియర్‌ వద్దకు వెళ్ళకుండానే కౌంటర్‌ వద్ద ఈ కార్డుల ద్వారా రిజిస్టర్‌ చేయించుకోవచ్చు. ఫార్మసీలలో కూడా ఈ కార్డులు ఉపయోగపడతాయి. విజిటర్స్‌కి సమయం వృధా కాకుండా ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు విమెన్స్‌ హాస్పిటల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మైక్‌ రిచ్‌మౌండ్‌ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com