రాజమౌళి శిష్యుడొస్తున్నాడోచ్.!
- August 18, 2022
75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాలు దేశం మొత్తం ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రతీ ఇంటిపైనా జాతీయ జెండా రెపరెపలాడుతూ ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని చాటి చెబుతోంది.ఈ సందర్భంగా ఓ దేశ భక్తి చిత్రం చర్చకు వచ్చింది.
‘1770’ అనే టైటిల్తో రూపొందుతోన్న చిత్రమిది. ప్రముఖ బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన ‘ఆనంద్మఠ్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. తెలుగుతో సహా పలు భాషలలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా మోషన్ పోస్టర్ని ఘనంగా రిలీజ్ చేశారు.
రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ‘ఆకాశ వాణి’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అశ్విన్ గంగరాజు. ఈ సినిమాకి రాజమౌళి నుంచి బాగా సపోర్ట్ లభించిందట. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ, స్ర్కీన్ప్లే అందిస్తున్నారు.
దేశ భక్తి కథాంశం కావడంతో, ఈ సినిమాకి సంబంధించి పీరియాడిక్ సెట్స్, పీరియాడిక్ ఎమోషన్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారట. స్వాతంత్ర్య సమరానికి స్పూర్తి నింపిన యోధులెందరో ఈ సినిమాలో ప్రస్థావనకొస్తారట. నటీనటులు, మిగిలిన టెక్నీషియన్స్ వివరాలు దీపావళికి వెల్లడి చేయనున్నారట.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







