ఇండియన్ 2 స్టార్ట్ అయితే, మెగా పవర్ స్టార్ పరిస్థితేంటీ.?
- August 18, 2022
క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘ఇండియన్ 2’. కమల్ హాసన్ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోన్న సినిమా ఇది.
అప్పట్లో ‘భారతీయుడు’ సినిమా సంచలన విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు ‘విక్రమ్’ సినిమాతో మరోసారి సంచలనాలకు తెర లేపారు కమల్ హాసన్. ఈ వేవ్ ఇలా వున్న టైమ్‌లోనే ‘ఇండియన్ 2’ని పూర్తి చేసేస్తే బాగుంటుందని శంకర్ భావిస్తున్నాడట.
ఆల్రెడీ కొంతమేర షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా రకరకాల వివాదాల కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా మొదలెట్టేశారు.
తాజాగా ‘ఇండియన్ 2’ సినిమా ఈ నెల 24 నుంచి మళ్లీ స్టార్ట్ అవుతోందంటూ అధికారికంగా ప్రకటించారు. ‘ఇండియన్ 2’ స్టార్ట్ అయితే, మరి, రామ్ చరణ్ సినిమా సంగతేంటీ.? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. ఈ అనుమానాలపై రామ్ చరణ్ కానీ, శంకర్ కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







