'Alhosn' యాప్‌లో పర్సనల్ డేటా షేరింగ్ వద్దు

- August 20, 2022 , by Maagulf
\'Alhosn\' యాప్‌లో పర్సనల్ డేటా షేరింగ్ వద్దు

యూఏఈ: 'Alhosn' అప్లికేషన్‌లోని ఖాతాదారులు తమ రహస్య సమాచారాన్ని(పర్సనల్ డేటా) పబ్లిక్‌గా షేర్ చేయవద్దని అధికారులు సూచించారు. అల్హోసన్ పాస్‌లపై ప్రదర్శించబడే ఖాతాదారుల వ్యక్తిగత సమాచారంతో కూడిన QR కోడ్ ను ఇతరులతో పంచుకోవద్దని అధికారులు ప్రజలను కోరారు. అలాగే వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) ను సైతం ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని సూచించారు. అప్లికేషన్‌లోని గ్రీన్ పాస్‌లో సున్నితమైన వ్యక్తిగత డేటా ఉంటుందని, ఈ డేటా సరిగ్గా షేర్ చేయకపోతే హ్యాకింగ్ కు గురవుతుందన్నారు. ఖాతాదారులు గ్రీన్ పాస్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని యాప్ అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com