26/11 తరహాలో ఉగ్ర దాడులు చేస్తాం..
- August 20, 2022
ముంబై: 26/11 ఉగ్రదాడి తరహాలో దేశ ఆర్థిక రాజధాని ముంబై పై ఉగ్ర దాడులు చేస్తామని బెదిరింపు సందేశం వచ్చింది.ఈ మేరకు ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ రూంకు ఒక మెసేజ్ వచ్చినట్లు వారు వెల్లడించారు.పాకిస్తాన్‌కు చెందిన ఫోన్ నెంబర్ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది. భారత్‌లో విధ్వంస ప్రణాళికలో ఆరుగురు వ్యక్తులు నిమగ్నమయ్యారని ఆ మెసేజ్ పేర్కొంది.
ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు విచారణ ప్రారంభించారు. బెదిరింపు మెసేజ్‌పై ఇతర ఏజెన్సీలనూ అధికారులు అప్రమత్తం చేశారు.మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ తీరంలో గురువారం బోటులో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్స్ పట్టుబడిన నేపధ్యంలో బెదిరింపు మెసేజ్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 26/11 ఉగ్రదాడి తరహాలో పడవలో ఆయుధాలు లభ్యం కావడంతో ఉగ్రముప్పు పొంచిఉందనే ఆందోళన నెలకొంది.స్ధానిక పోలీసు అధికారులతో పాటు యాంటీ టెర్రర్ స్వ్కాడ్ బృందాలు ఘటనా స్ధలానికి చేరుకుని బోటు ఎక్కడినుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు.నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం కూడా ఘటనా స్ధలానికి చేరుకుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







