ఖతార్-ఇండియా మధ్య ఎయిర్ ఇండియా కొత్త సర్వీసులు
- August 23, 2022
దోహా: ఎయిర్ ఇండియా అక్టోబర్ 30 నుండి దోహా, ఖతార్‌కు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించాలని యోచిస్తోంది. దోహా-ముంబై-దోహా రూట్ కోసం టికెట్ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. వారంలో మంగళవారం, శుక్రవారం, ఆదివారం మూడు విమాన సర్వీసులను నడుపనుంది. అక్టోబర్ 30న దోహా నుండి ముంబైకి నాన్‌స్టాప్ ఎయిర్ ఇండియా విమానం 12:45 గంటలకు బయలుదేరి.. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:45 గంటలకు ముంబైలో ల్యాండ్ అవుతుందని పేర్కొంది, దీని టిక్కెట్ ధర QR920గా నిర్ణయించారు. ఎయిర్‌లైన్ వెబ్సైట్ బుకింగ్‌లు ప్రస్తుతం మార్చి 19 వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. భవిష్యత్ లో వీటి సంఖ్యను ఆరుకు పెంచాలని యోచిస్తున్నట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. అలాగే నవంబర్‌లో జరిగే ఫిఫా ప్రపంచకప్ సందర్భంగా మరికొన్ని ప్రత్యేక సర్వీసులను ఎయిర్ ఇండియా నడపాలని యోచిస్తోందని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









