సేవల్లో నిర్లక్ష్యం.. డ్రైవింగ్ స్కూల్ యజమాన్యానికి జైలుశిక్ష, జరిమానా
- August 23, 2022
మస్కట్: సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవింగ్ స్కూల్ మేనేజ్ మెంట్ కు సుహార్‌లోని ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్ట్ రెండు నెలల జైలు శిక్ష, RO100 జరిమానా విధించింది. డ్రైవింగ్ స్కూల్ క్లయింట్‌లలో ఒకరు సోహార్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. కోర్టు ఫైల్స్ ప్రకారం.. క్లయింట్ డ్రైవింగ్ నేర్పేందుకు ట్రైనర్ ను నియమించారు. కానీ అతడు మధ్యలోనే మరణించారు. అయినా మరో ట్రైనర్ ను డ్రైవింగ్ స్కూల్ మేనేజ్ మెంట్ ఏర్పాటు చేయలేదు. పైగా క్లయింట్ కట్టిన ఫీ ని కూడా తిరిగిఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రాయల్ డిక్రీ నంబర్ 66/2014 ద్వారా జారీ చేయబడిన వినియోగదారుల రక్షణ చట్టంలోని నిబంధనలను డ్రైవింగ్ స్కూల్ ఉల్లంఘించినట్లు క్లయింట్ ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు డ్రైవింగ్ స్కూల్ మేనేజ్ మెంట్ పై చర్యలు తీసుకున్నది.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







