భారత్‌లోకి అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు పాకిస్తానీల కాల్చివేత
- August 23, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్తానీలను ఇండియన్ ఆర్మీ కాల్చి చంపింది. జమ్ము-కాశ్మీర్, రాజౌరి జిల్లా, నౌషేరా సెక్టార్ పరిధిలోని ఎల్ఓసీ వద్ద సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. సోమవారం సరిహద్దులో భద్రతా దళం గస్తీ కాస్తుండగా, ఇద్దరు పాకిస్తానీలు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.
రాత్రిపూట చీకట్లో సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక ల్యాండ్‌మైన్ పేలింది. ఇది గుర్తించిన సైన్యం వెంటనే అప్రమత్తమైంది. సరిహద్దు వెంట గస్తీ నిర్వహించింది. ఈ దశలో ఇద్దరు చొరబాటుదారుల్ని గుర్తించిన సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు చొరబాటుదారులు మరణించారు. వీరిద్దరినీ తీవ్రవాదులుగా అనుమానిస్తున్నారు. తర్వాత వారి మృతదేహాల్ని సైన్యం స్వాధీనం చేసుకుంది.
ఈ ప్రాంతంలో ఇంకెవరైనా చొరబాటుదారులు వచ్చారా అనే కోణంలో అన్ని చోట్లా మరింత భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు సైనికాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







