రామ్ చరణ్ - శంకర్ ప్రాజెక్ట్ పరిస్థితి అంతేనా.?
- August 23, 2022
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్‌తో బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ హుషారుగా పని చేసింది.
అయితే, ఇటీవలే ‘ఇండియన్ 2’ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. రెండేళ్ల క్రితం అనగా 2020లో అనుకోని ప్రమాదం కారణంగా చిత్ర యూనిట్లో ఒకరు మరణించడంతో ఈ సినిమా అర్ధాంతరంగా వాయిదా పడింది.
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ‘విక్రమ్’ సినిమాతో కమల్ హాసన్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేశారు. బాక్పాఫీస్ వద్ద కాసుల పంట పండించింది విడుదలైన అన్ని భాషల్లోనూ ‘విక్రమ్’ సినిమా. దాంతో, ఈ ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించాలనుకుంటున్నారట.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నానంటూ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా అఫీషియల్‌గా ప్రకటించింది. సెప్టెంబర్‌లో ఈ సినిమా తిరిగి సెట్స్ మీదికెళ్లనుంది. తాజా షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారట చెన్నైలో.
అంతా బాగానే వుంది. మరి, రామ్ చరణ్ సినిమా సంగతేంటీ.? అంటే, ఈ సినిమా దాదాపు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందనీ అంటున్నారు. అయితే, అంత త్వరగా శంకర్ సినిమాలు పూర్తయ్యే అవకాశం లేదు. మరి, ఈ సినిమాని పక్కన పెట్టేసి, శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాపై ఫోకస్ పెడతాడా.? లేక జరుగుతున్న ప్రచారం ప్రకారం నిజంగానే చరణ్ సినిమా పూర్తి చేసేశాడా.? లేక రెండూ సమాంతరంగా పూర్తి చేస్తాడా.? తెలియాలంటే చరణ్ కానీ, శంకర్ కానీ క్లారిటీ ఇవ్వాల్సి వుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







