మొన్న పవన్-రేణు దేశాయ్, ఇప్పుడు ధనుష్ - ఐశ్వర్య: అలా కలిసిపోయారన్నమాట.!

- August 23, 2022 , by Maagulf
మొన్న పవన్-రేణు దేశాయ్, ఇప్పుడు ధనుష్ - ఐశ్వర్య: అలా కలిసిపోయారన్నమాట.!

ఔను మేం విడిపోతున్నాం.. అంటూ ఈ మధ్య చాలా జంటలు విడిపోయి సెన్సేషనల్ అయ్యాయ్ సినీ వినీలాకాశంలో. అలాంటి జంటల్లో ఒకరైన ధనుష్, ఐశ్వర్య జంట మళ్లీ కలిసి కనిపించి, అందర్నీ షాక్‌కి గురి చేసింది.
అదేంటీ.? అభిప్రాయాలు కలవడం లేదంటూ, వారి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో ముగింపు పలికేశారు కదా.. మళ్లీ కలిసిపోవడమేంటీ.? అనుకుంటున్నారా.? అవును నిజమే. జనవరిలో ఈ జంట విడాకులు తీసుకోవడం ద్వారా వైవాహిక బంధాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 
అయితే, వీరికి ఇద్దరు కుమారులున్న సంగతి కూడా తెలిసిందే. వారిలో పెద్ద కొడుకు యాత్ర, స్కూల్ ఈవెంట్‌కి సంబంధించి విడిపోయిన తల్లితండ్రులు ఒక్కటిగా కనిపించారు. 
అలా అని కలిసిపోలేదనుకోండి. ఒక్కటిగా కనిపించారంతే. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ జంట కూడా ఇలాగే ఒక్కటిగా కనిపించారు. ఈ జంట కూడా విడాకులు తీసుకుని ఎవరి వ్యక్తిగత జీవితాలు వారు, తమకి నచ్చినట్లుగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. 
కానీ, ఈ జంటకు సంతానమైన అకీరానందన్ స్కూల్ ఈవెంట్ కోసం మళ్లీ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కలసి కనిపించారు. ఆ ఫోటోలు అప్పుడు అంతే వైరల్ అయ్యాయ్. ఇప్పుడు ధనుష్, ఐశ్వర్య తమ కుమారులతో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
కలిసి కనిపించినంత మాత్రాన ఈ మాజీ దంపతులు మళ్లీ ఒక్కటి కాలేదండోయ్. ఇదంతా కేవలం పిల్లల కోసం మాత్రమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com