హమ్మయ్యా.! ‘పుష్ప 2’ ఇప్పుడైనా ముందుకు కదిలినట్లేనా.!

- August 23, 2022 , by Maagulf
హమ్మయ్యా.! ‘పుష్ప 2’ ఇప్పుడైనా ముందుకు కదిలినట్లేనా.!

అనుకోకుండా ‘పుష్ప’ అనూహ్యమైన విజయం అందుకుంది. నిజంగా చెప్పాలంటే, ఓ కథా, కాకరకాయ్ లేని సినిమా ఇది. లెక్కల మాస్టారు సుకుమార్ మార్క్ సినిమా కానే కాదిది. కోవిడ్ టైమ్‌లో ఏదో అలా అలా సినిమాని కానిచ్చేసి, ధియేటర్లో వదిలేశారంతే.
లక్కు బాగుంది. కంటెంట్‌తో పని లేకుండా, తప్పులు ఎత్తకుండా, బ్రహ్మండమైన విజయం కట్టబెట్టేశారు ఈ సినిమాకి. నో డౌట్ ఈ సినిమాలో పాటలు అయితే సూపర్ హిట్ అయ్యాయనే చెప్పాలి. బోర్డర్లు దాటి మరీ మంచి విజయం అందుకున్నాయ్ ‘పుష్ప’ పాటలు.
అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా సెకండ్ పార్ట్ త్వరలో స్టార్ట్ చేయనున్నారట. నిజానికి ఎప్పుడో ఈ సినిమా పట్టాలెక్కేయాలి. కానీ, మొదటి పార్ట్ ఇచ్చిన ఊపుతో రెండో పార్ట్ విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని వుంది ‘పుష్ప’ టీమ్. మొదటి పార్ట్‌లో ఎంచకుండానే గ్రహించిన తప్పుల్ని రెండో పార్ట్‌లో చేయకుండా వుండాలని నిర్ణయించుకుంది.
దాంతో సరికొత్త కథ కోసం టైమ్ తీసుకుంది. ఎట్టకేలకు స్ర్కిప్ట్ వర్క్ పూర్తి కావడంతో, తాజాగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసేసింది సుక్కు అండ్ టీమ్. ఇంకేముంది, వీలైనంత త్వరలోనే సినిమాని పట్టాలెక్కించేయడేమ మిగిలుంది. అందుకోసం టీమ్ సర్వం సిద్ధం చేసిందట. చూడాలి మరి, ఇప్పటికైనా ‘పుష్ప 2’ పట్టాలెక్కినట్లేనేమో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com