కువైట్ లో టాక్సీ డ్రైవర్లకు 8 కీలక సూచనలు
- August 24, 2022
కువైట్ : దేశంలోని ట్యాక్సీ కార్లను నిర్వహిస్తున్న మొబైల్, కాల్-టాక్సీ కంపెనీలు, టాక్సీ కార్యాలయాలకు జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ ఎనిమిది కీలక ఆదేశాలు జారీ చేసింది. పౌరులు, నివాసితులు, డ్రైవర్ల భద్రతకు హామీ ఇచ్చే విధంగా ఉత్తమ సేవలను అందించడంతోపాటు రోడ్లపై ట్రాఫిక్‌ను సులభతరం చేయడం ఈ సూచనల ప్రధాన లక్షమని డైరెక్టరేట్ తెలిపింది. తాజా సూచనల ప్రకారం.. డ్రైవర్ సీటు వెనుక ప్రదేశంలో అరబిక్, ఇంగ్లీష్ భాషలలో టాక్సీ లైసెన్స్ వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలి. ఇందులో టాక్సీ కంపెనీ వివరాలు, డ్రైవర్ ఫోన్ నంబర్‌ను స్పష్టంగా తెలపాలి. మొబైల్ టాక్సీ పనిచేసే స్థితిలో ఉన్న మీటర్‌ను కలిగి ఉండాలి. ప్రయాణికులు లేని సమయంలో టాక్సీ సైన్ లైట్ తప్పనిసరిగా ఆన్ చేయాలి. ఆన్-డిమాండ్ టాక్సీలు వీధుల నుండి ప్రయాణీకులను పికప్ చేయడానికి అనుమతించరు. అలాగే కాల్ టాక్సీ డ్రైవర్లు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ప్రయాణీకులను పికప్ చేయడానికి అనుమతించరు. హైవేలు లేదా ప్రధాన రహదారుల నుండి ప్రయాణీకులను ఎక్కించుకునేందుకు మొబైల్ టాక్సీ డ్రైవర్లకు అనుమతి లేదు.టాక్సీ డ్రైవర్లు ప్రయాణీకులను మాత్రమే రవాణా చేయాలి.టాక్సీలో వస్తువులను లేదా ఆహారాన్ని రవాణా చేయడానికి అనుమతి లేదని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ తాజా సూచనల్లో పేర్కొంది.ఈ సూచనలను ఉల్లంఘించిన టాక్సీ డ్రైవర్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







