దక్షిణ ఖతార్‌లో పేలుడు శబ్దాలపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- August 24, 2022
ఖతార్: దేశ గగనతలంలో ఖతార్ అమీరీ వైమానిక దళం రెగ్యులర్ ఎక్సర్ సైజులో భాగంగానే డమ్మీ బాంబులను ప్రయోగించారని, దీని కారణంగానే దేశానికి దక్షిణాన ఉరుము లాంటి బలమైన శబ్దం వినిపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసిన అధికారిక ట్వీట్ లో తెలిపింది. అంతకుముందు అల్ వక్రా, అల్ వుకైర్, దోహా దక్షిణ శివార్లలో నివసిస్తున్న చాలా మంది నివాసితులు పేలుడు లాంటి పెద్ద శబ్దాన్ని విని కంగారు పడ్డారు. ఈ క్రమంలో చాలా మంది తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను డ్రైవింగ్ చేస్తుండగా తన కారును ఏదో ఢీకొట్టినట్లు భావించినట్లు అల్ వుకైర్ నివాసి సోషల్ మీడియాలో తెలిపారు. మరో వ్యక్తి తన ఇంటి పక్కన ఆకాశం నుండి ఏదో పెద్ద వస్తువు పడిపోయిందని భావించానని చెప్పాడు. పేలుడు శబ్దానికి తమ ఇల్లు కంపించినట్లు, కొన్ని కిటికీలు తెరిచినట్లు తనకు అనిపించిందని మరో మహిళ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







