ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు
- August 27, 2022
న్యూ ఢిల్లీ: ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.సదరన్ రీజియన్ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు కేవలం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 456 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీల్లో జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్) 132 ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్) 10 ఖాళీలు, సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్) 13 ఖాళీలు, సీనియర్ అసిస్టెంట్(అధికారిక భాష) 1 పోస్టు ఉన్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.రాతపరీక్ష, వైద్య, ఫిజికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన జూనియర్ అసిస్టెంట్ అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి 92,000, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.36,000 నుంచి 1,10,000 వరకు చెల్లిస్తారు.
అభ్యర్ధుల ఎంపికకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు ప్రక్రియ 01 సెప్టెంబరు2022న ప్రారంభమై 30సెప్టెంబరు 2022తో ముగియనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్పhttp://https://www.aai.aero/en/recruitmentరిశీలించగలరు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







