లివాలో కొత్తగా ఐదు పాఠశాలలు ప్రారంభం
- August 28, 2022
మస్కట్: కొత్త విద్యా సంవత్సరం కోసం RO12 మిలియన్ల వ్యయంతో లివా, ఉత్తర బటినాలో ఐదు పాఠశాలలను విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ప్రారంభించింది. గృహనిర్మాణ- పట్టణ ప్రణాళిక మంత్రి డాక్టర్ ఖల్ఫాన్ బిన్ సయీద్ అల్ షుయాలితో కలిసి విద్యా మంత్రి డాక్టర్ మదిహా బింట్ అహ్మద్ అల్ షైబానియా ఇటీవల కొత్త పాఠశాలలను సందర్శించారు. ఈ పర్యటనలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదు పాఠశాలల పురోగతిపై సమీక్షించారు. అదే సమయంలో మార్చి 2022లో సుల్తానేట్‌లోని వివిధ ప్రాంతాల్లో 76 కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసే ప్రణాళిక వివరాలను MoE వెల్లడించింది. కొత్త పాఠశాలలు సాయంత్రం తరగతుల సంఖ్యను తగ్గించడంతో పాటు తరగతి గదులలో విద్యార్థుల నిష్పత్తిని తగ్గిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొత్తగా మస్కట్‌లో 19, నార్త్ బతినాలో 17, సౌత్ బతినాలో 11, సౌత్ షర్కియా, ధోఫర్‌లలో తొమ్మిది చొప్పున, దఖ్లియాలో ఐదు, బురైమి, ముసందంలో రెండు, ఉత్తర షర్కియా, ధహిరాలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 76 కొత్త పాఠశాలల్లో పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. కొత్త పాఠశాలల్లో దాదాపు 80,000 మంది విద్యార్థినీ, విద్యార్థులు విద్యనభ్యసించేందుకు అవకాశం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







