మహిళలను ఫుట్‌బాల్ స్టేడియంలోకి అనుమతించిన ఇరాన్
- August 28, 2022
టెహ్రాన్: దేశ రాజధాని లోని ఆజాదీ స్టేడియంలో రెండు ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌ల మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్‌ని వీక్షించేందుకు తొలిసారిగా మహిళలను ఇరాన్ పాలకులు అనుమతించారు.
పర్షియన్ గల్ఫ్ ప్రో లీగ్‌లో మెస్ కెర్మాన్తో జరిగిన మ్యాచ్‌లో ఎస్టేగ్లాల్ పోరును చూసేందుకు దాదాపు 500 మంది మహిళా అభిమానులు పశ్చిమ టెహ్రాన్‌లోని ఐకానిక్ ఫుట్‌బాల్ స్టేడియంకు చేరుకున్నారు.
మ్యాచ్ చూసేందుకు తమను అనుమతించినందుకు మహిళలు ఆనందంతో కన్నీళ్లతో ఏడుస్తున్న మరియు కేకలు వేయడం మరియు తమ అభిమాన జట్టును ఉత్సాహపరుస్తున్నట్లు వీడియోలు ఆన్లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి .
ఆజాదీ స్టేడియంలో మీ ఉనికిని చూసి మేము సంతోషిస్తున్నాము అని ఆటకు ముందు ఎస్టేగ్లాల్ నిర్వాహకులు ట్వీట్లో రాశారు.
దేశంలోని పురాతన ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటైన ఎస్టేగ్లాల్ - హోమ్ జట్టుకు మద్దతుగా చాలా మంది మహిళలు నీలిరంగు జెర్సీలు మరియు టోపీలను ధరించారు. ఈ మ్యాచ్ లో ఎస్టేగ్లాల్ 1-0తో గెలిచింది.
ఎస్టేగ్లాల్ గెలిచినప్పటికీ, చివరకు స్టేడియానికి చేరుకున్న మహిళలే నిజమైన విజేతలు అని సోషల్ మీడియా ఈ "చారిత్రక క్షణాన్ని" ప్రశంసించింది.
1979 తర్వాత నుండి ఇస్లామిక్ రిపబ్లిక్‌లోని స్పోర్ట్స్ స్టేడియాలలోకి మహిళలు ప్రవేశించడం నిషేధించబడింది. నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రపంచ ఫుట్‌బాల్ పాలకమండలి(FIFA) డిమాండ్ చేయడంతో ఈ సమస్య పై ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య మరియు FIFAల మధ్య ఘర్షణకు గురి చేసింది.
2022 ప్రపంచ కప్‌కు స్వదేశీ జట్టు అర్హత సాధించిన ఇరాన్ ఇరాక్‌ను చూసేందుకు 2,000 మంది మహిళలను ఆజాదీ స్టేడియంలోకి అనుమతించారు.
దీనికి ముందు, 2019లో ఇరాన్‌కు చెందిన పెర్సెపోలిస్ మరియు జపాన్‌కు చెందిన కాషిమా ఆంట్లర్స్ మధ్య జరిగే ఆసియా ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌ను చూడటానికి మహిళలను స్టేడియం లోపలికి అనుమతించారు. పురుషుల ఆటలను మహిళలు ప్రత్యక్షంగా చూడటం 40 ఏళ్లలో ఇదే తొలిసారి.
మొన్న మార్చిలో, లెబనాన్‌తో జరిగిన ఇరాన్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో మషాద్‌లోని స్టేడియంలోకి ప్రవేశించకుండా మహిళలను నిషేధించడంతో వివాదం చెలరేగింది.దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది, ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
అయితే, స్థానిక లీగ్ మ్యాచ్‌ని వీక్షించేందుకు ఇరాన్ మహిళలకు తొలిసారి అనుమతి లభించడం కావడం గమనార్హం.
కాలానికి అనుగుణంగా తీసుకునే నిర్ణయాలు ప్రజలకు సంతృప్తిని ఇస్తాయని మాజీ ప్రభుత్వ ప్రతినిధి అలీ రబీ మ్యాచ్ తర్వాత ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







