భారత్-పాక్ మ్యాచ్‌లో ‘లైగర్’ సందడి..

- August 28, 2022 , by Maagulf
భారత్-పాక్ మ్యాచ్‌లో ‘లైగర్’ సందడి..

దుబాయ్: ఇటీవలే ‘లైగర్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన యువ హీరో విజయ్ దేవరకొండ దుబాయ్‌లో జరుగుతున్న భారత్-పాక్ మ్యాచ్‌ను నేరుగా వీక్షించాడు.ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌ నేరుగా చూసేందుకు ఆయన దుబాయ్ చేరుకున్నాడు.స్టేడియంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, జతిన్ సప్రుతో మాట్లాడాడు.వారితో కలిసి మ్యాచ్ చూశాడు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ మ్యాచ్ చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పాడు.‘‘మ్యాచ్ కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను.ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తాడని ఆశిస్తున్నా.20 పరుగులు చేశాడంటే కచ్చితంగా 50 పరుగులు సాధిస్తాడు. ఇది ఆయనకు వందో మ్యాచ్. ఆయన బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తున్నా’’ అని విజయ్ వ్యాఖ్యానించాడు.విజయ్‌కు సంబంధించిన ఈ షెడ్యూల్ ముందుగానే ఫిక్సైంది.

మ్యాచ్ చూడటంతోపాటు, లైగర్ ప్రమోషన్ల కోసం కూడా ఇక్కడికి రావాలనుకున్నాడు.సినిమా నెగెటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, ప్రేక్షకులతో కలిసి ఉత్సాహంగా మ్యాచ్ చూసేందుకు విజయ్ దుబాయ్ వెళ్లడం విశేషం. ఇటీవలే పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘లైగర్’ నెగెటివ్ టాక్‌తో నడుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com