ఉద్యోగుల సెకండ్మెంట్ అభ్యర్థనలకు ఇ-సర్వీసులు ప్రారంభం
- September 01, 2022
ఖతార్: ఉద్యోగుల సెకండ్మెంట్ అభ్యర్థనల కోసం కొత్త ఇ-సేవను ప్రారంభించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రకటించింది. ఈ సేవ ప్రక్రియలను వేగవంతం చేయడం, లావాదేవీలను పారదర్శకంగా పూర్తి చేయడానికి డిజిటల్ పరివర్తన వ్యూహంలో భాగంగా ఈ సర్వీసును ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త సేవ ప్రస్తుత యజమానిని మార్చాల్సిన అవసరం లేకుండా మరొక కంపెనీ లేదా సంస్థకు కార్మికుల సెకండ్మెంట్ కోసం అభ్యర్థనలను సమర్పించడానికి కూడా అనుమతిస్తుందని పేర్కొంది. అప్లికేషన్ ఆమోదం పొందిన తరువాత ఉద్యోగులు కొత్త కంపెనీలో పూర్తి సమయం లేదా పార్ట్ టైమ్ పని చేసుకోవచ్చు.ఈ సేవ ప్రస్తుత యజమాని ఆమోదానికి లోబడి ఉంటుందని, వర్కర్ సెకండ్ చేయబడిన కంపెనీ కూడా పూర్తిగా రిజిస్టర్ చేయబడి ఉండాలని, 2004 నాటి లేబర్ లా నం. 14 నిబంధనలకు అనుగుణంగా ఆమోదించబడాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. సెకండ్మెంట్ వ్యవధి గరిష్టంగా ఆరు నెలలు మించకూడదని, అలాగే ఉద్యోగి నివాస అనుమతి గడువు తేదీని కూడా మించకూడదని వెల్లడించింది. ప్రైవేట్ సంస్థలు, కంపెనీలు, ప్రజలు https://www.mol.gov.qa/ar/pages/default.aspx వెబ్సైట్ ద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ సేవలను పొందవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







