BD300,000 తీసుకొని నకిలీ బహ్రెయిన్ పాస్‌పోర్ట్ అందజేత
- September 01, 2022
బహ్రెయిన్: నకిలీ పాస్‌పోర్ట్‌ను మరొక వ్యక్తికి విక్రయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బహ్రెయిన్ వ్యక్తి అప్పీల్‌ను హై అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. 24 ఏళ్ల నిందితుడు బహ్రెయిన్ పాస్‌పోర్ట్‌లను అందజేస్తానని పలువురిని మోసం చేశాడు. అనేక మందికి నకిలీ పాస్‌పోర్ట్‌లను అంటగట్టాడు. ఈ క్రమంలోనే 59 ఏళ్ల అరబ్ వ్యక్తితో బహ్రెయిన్ పాస్ పోర్ట్ కోసం BD300,000కు బేరం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అరబ్ వ్యక్తికి నకిలీ పాస్‌పోర్టు అందజేస్తుండగా.. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తన వద్ద దొంగిలించబడిన ఒరిజినల్ పాస్‌పోర్ట్ ఉందని, దానిని టర్కీకి పంపానని, అక్కడ నకిలీ పాస్‌పోర్ట్‌లను తయారు చేయిస్తానని నిందితుడు విచారణ సందర్భంగా కోర్టు ముందు అంగీకరించాడు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







