ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సౌదీ ఇ-వీసా

- September 02, 2022 , by Maagulf
ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా సౌదీ ఇ-వీసా

సౌదీ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) నివాసితులు సౌదీ ఆన్‌లైన్ పోర్టల్‌ ద్వారా eVisa కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని సౌదీ అరేబియా పర్యాటక మంత్రిత్వ శాఖ కల్పించింది. ఈ మేరకు డిక్రీని ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. యూకే, యూఎస్  లేదా స్కెంజెన్ అగ్రిమెంట్ దేశాలలో ఒకదాని నుండి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసా ఉన్నవారు దేశంలోకి ప్రవేశించడానికి కనీసం ఒక్కసారైనా టూరిస్ట్ లేదా బిజినెస్ వీసాను ఉపయోగించిన వారికి వీసా ఆన్ అరైవల్ స్కీమ్ వర్తిస్తుంది. ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ కొత్త డిక్రీ ఉపయోగపడుతుందని సౌదీ అరేబియా టూరిజం మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ తెలిపారు. ఇ-వీసా విధానం ప్రారంభమైన 2019 నుంచి ఇప్పటివరకు 1 మిలియన్లకు పైగా ఈవీసాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com