షార్జా ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం

- September 02, 2022 , by Maagulf
షార్జా ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం

యూఏఈ: 430,000 దిర్హామ్‌ల విలువైన బంగారాన్నితన లగేజీలో దాచి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన 35 ఏళ్ల ఆసియా వ్యక్తిని షార్జా ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్టు చేశారు. షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని బ్యాగేజీ చెకింగ్ కౌంటర్‌లోని అధికారులకు సదరు ప్రయాణీకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిందని, ఆ తర్వాత అతని హ్యాండ్ లగేజీని చేక్ చేసినట్లు ఎయిర్‌పోర్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ మటర్ సుల్తాన్ అల్ కెత్బీ తెలిపారు. తనిఖీల్లో ఆ వ్యక్తి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను ఇన్‌వాయిస్‌, ఆభరణాలు తనవేనని రుజువు చేసే పేపర్లు లేకుండా తీసుకెళ్తున్నట్లు గుర్తించినట్లు కెత్బీ వివరించారు. యూఏఈలోని ఇసుక ప్రాంతంలో తనకు ఆ బంగారం దొరికిందని నిందితుడు తమ విచారణలో పేర్కొన్నాడని సుల్తాన్ అల్ కెత్బీ చెప్పారు. తదుపరి విచారణ కోసం నిందితుడిని పోలీసులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com