సీఎం కేసీఆర్‌కు కిషన్ రెడ్డి లేఖ..
- September 03, 2022
న్యూఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన ఏడాది తర్వాత స్వేచ్ఛావాయువులు పీల్చిన తెలంగాణ గడ్డపై స్వాతంత్ర్య వజ్రోత్సవాలను (75 ఏళ్ల సంబరాలు) ఘనంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది.ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానుండగా.. గౌరవ అతిథులుగా ఈ కార్యక్రమంలో హాజరుకాగలరని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మైలకు కిషన్ రెడ్డి లేఖలు రాశారు.
ఈ కార్యక్రమం మొదలుకుని వచ్చే ఏడాది అంటే, 17 సెప్టెంబర్ 2023వరకు నిజాం పాలిత ప్రాంతాల్లోని నాటి అరాచక పాలనపై పోరాటం చేస్తూ మన,ధన, ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ స్మరించుకునేలా కార్యక్రమాలు నిర్వహించాలని 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో కోరిన కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను కూడా సూచించాలని కోరారు.
‘ఈ గడ్డపై పుట్టిన వ్యక్తిగా, చరిత్రపై సూక్ష్మమైన అవగాహన ఉన్న వ్యక్తిగా, నిజాంకు వ్యతిరేకంగా ప్రజల పోరాటం గురించి స్పష్టమైన ఆకళింపు కలిగిన వ్యక్తిగా.. తెలంగాణ విమోచన ఉద్యమ ప్రాముఖ్యత మీకు తెలిసిందే. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో, తెలంగాణ విమోచనంలో మన పెద్దలు చేసిన త్యాగాలను, వారి శౌర్య, పరాక్రమాలను ప్రస్తుత తరానికి తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం’ అని సీఎం కేసీఆర్ కు రాసిన లేఖలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







