మస్కట్‌లో 45% వాడీలకు పొంచిఉన్న వరద ముంపు
- September 04, 2022
మస్కట్: గ్రేటర్ మస్కట్ మాస్టర్ ప్లాన్ 2023 మొదటి త్రైమాసికంలో పూర్తవుతుందని హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గ్రేటర్ మస్కట్ స్కీమాటిక్ ప్లానింగ్ స్ట్రక్చర్‌పై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల నుండి దాదాపు 100 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మస్కట్ సహజ లక్షణాలు, చారిత్రక ప్రదేశాల పరిరక్షణ గురించి వివరించారు. ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు, పెరుగుతున్న నగర జనాభా అవసరాలను స్థిరమైన మార్గంలో అందించడంపై చర్చించారు. చర్చలో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా వచ్చే ప్రమాదంపై కూడా చర్చించారు. మస్కట్‌లో 45 శాతం వాడి వరదలకు, 20 శాతం తీరప్రాంత వరదలకు గురయ్యే అవకాశం ఉందని వర్క్‌షాప్‌లో అధికారులు హెచ్చరించారు. గ్రేటర్ మస్కట్ స్ట్రక్చర్ ప్లాన్ ప్రాజెక్ట్ మేనేజర్ యాకూబ్ అల్ హార్తీ మాట్లాడుతూ.. మస్కట్‌లో వరద నష్టాలను తగ్గించడానికి అనేక ఆలోచనలు ఉన్నాయన్నారు. వాడీలను విస్తరించడం, వరదల నష్టాలను తగ్గించడానికి ఇంజనీరింగ్ పరిష్కారాలను కనుగొనడం, తీరప్రాంత వరదలను తగ్గించడానికి సముద్రపు స్తంభాలపై నగరాలను నిర్మించడం వంటివి ఉన్నాయన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







