సెప్టెంబర్ 10 వరకు షైల్ 2022.. పాల్గొంటున్న 180 కంపెనీలు
- September 04, 2022
దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ (కటారా) నిర్వహించే ఇంటర్నేషనల్ హంటింగ్ అండ్ ఫాల్కన్స్ ఎగ్జిబిషన్ (షైల్ 2022) ఆరవ ఎడిషన్లో వేట ఆయుధాలు, వేట సామాగ్రి, ఫాల్కన్లు, హంటింగ్ ట్రిప్స్లో నైపుణ్యం కలిగిన 20 దేశాల నుండి 180 కంపెనీలు పాల్గొననున్నాయి. ఇది సోమవారం ప్రారంభమై సెప్టెంబర్ 10 వరకు కొనసాగనుంది. దేశంలోని అనేక మంత్రిత్వ శాఖలు, అధికారులు, ఇతర సంస్థలు హాజరు కానున్న ఈ ఎగ్జిబిషన్ కు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫాల్కన్రీ, వేటగాళ్లు, ఫాల్కన్ ప్రేమికులు హాజరవుతుంటారు. షైల్ ఎగ్జిబిషన్ ఐదు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్నారు. హెక్మా స్క్వేర్లోని ప్రధాన మందిరంలో స్నిపర్ సామాగ్రి, వేటకు ఉపయోగించే పరికరాలు, సాంప్రదాయ పరిశ్రమలు, వేటతో సంబంధం ఉన్న హస్తకళలు ప్రదర్శించబడతాయి. రెండవ ప్రాంతంలో ఆయుధ కంపెనీల కోసం ఒక హాల్ ని ఏర్పాటు చేశారు. మూడు, నాలుగులలో పక్షుల క్షేత్రాలు, వేట ప్రయాణాల కోసం ఫోర్-వీల్-డ్రైవ్ కార్లను ప్రదర్శించనున్నారు. కటారా దక్షిణ భాగంలో ఉన్న ఐదవ హాలులో ఆయుధాలు, రైఫిల్స్, మందుగుండు సామగ్రి ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. ఆరవ ఎడిషన్ లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దీనితోపాట ఫాల్కన్ రంగంలో నిపుణులు, ప్రముఖ వేటగాళ్లు తమ అనుభవాలను పంచుకునే పలు సెషన్ లను నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







