లాటరీ కొన్న రెండోసారికే ఊహించని విధంగా 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు!
- September 04, 2022
అబుధాబి: అదృష్టం ఎప్పుడు, ఎవరిని, ఎలా వరిస్తుందో చెప్పలేం.కొందరికి ఊహించని విధంగా రాత్రికి రాత్రి కోట్లు వచ్చిపడుతుంటాయి.ఎంతో మంది ఎన్నో ఏళ్ళుగా లాటరీలో లక్కు కోసం పరితపిస్తూ ఉంటారు.అయితే ఊహించని విధంగా ఓ ఫ్రెంచి వ్యక్తికి రెండోసారే అబుధాబి బిక్ టికెట్ ర్యాఫిల్ లో భారీ జాక్ పాట్ కొట్టాడు.ఒకటికాదు రెండుకాదు ఏకంగా 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు.ఇలా అదృష్టం వరించడంతో ఫ్రెంచ్కు చెందిన సెలిన్ జాసిన్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. దుబాయ్లో ఉండే సెలిన్ జాసిన్ ఆన్లైన్ ద్వారా ఆగస్టు 13న అబుధాబి బిగ్టికెట్ ర్యాఫిల్ లో నం. 176528 గల లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.
ఇది అతడు కొనుగోలు చేసిన రెండో టికెటే కావడం గమనార్హం.శనివారం అబుధాబి ఎయిర్పోర్టులో నిర్వహించిన డ్రాలో సెలిన్ జాసిన్ కొన్న ఈ టికెట్కే జాక్పాట్ తగిలింది.దాంతో విజేతగా నిలిచిన అతడు 20 మిలియన్ల దిర్హాములు గెలుచుకున్నాడు.ముందుగా ఈ వార్తా తాను నమ్మలేదని, బిగ్ టికెట్ లాటరీ నిర్వాహకులు తనకు ఫోన్ చేసి చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బై పోయానని ఆనందం వ్యక్తం చేశాడు.కాగా, బిగ్ టికెట్ ర్యాఫిల్ గెలిచి తొలి ఫ్రెంచ్ వ్యక్తి సెలిన్ జాసినే. ఇక ఇదే డ్రాలో భారత్కు చెందిన జయకుమార్ వాసుపిళ్లై అనే వ్యక్తి 1లక్ష దిర్హాములు గెలుచుకున్నాడు.మరో భారత వ్యక్తి అజయ్ భాటియా కూడా కోటి రూపాయలు విలువ చేసే మసెరటి ఘిబ్లీ హైబ్రిడ్ జీటీ అనే కాస్ట్లీ కారు గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







