పాకిస్థాన్‌కు భారీ మానవతా సాయం: బహ్రెయిన్ రాజు
- September 05, 2022
బహ్రెయిన్: భారీ వర్షాలు, వరదలతో కుదేలైన పాకిస్థాన్ బహ్రెయిన్ భారీ మనవతా సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆదేశాలు జారీ చేశారు. ది కింగ్ ఫర్ హ్యుమానిటేరియన్ వర్క్స్ అండ్ యూత్ అఫైర్స్ ప్రతినిధి షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా నేతృత్వంలోని రాయల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ (RHF) ద్వారా బాధితులకు తక్షణ మానవతా సహాయ సహాయాన్ని అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ కు భారీ సాయాన్ని ప్రకటించిన కింగ్ హమద్‌కు షేక్ నాసర్ బిన్ హమద్ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్థాన్ లో వరదల కారణంగా ప్రభావితమైన వారికి మెరుగైన సాయం అందించేందుకు పాకిస్థాన్‌లోని అధికారులతో మాట్లాడుతున్నట్లు RHF సెక్రటరీ-జనరల్ డాక్టర్ ముస్తఫా అల్ సయ్యద్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







