సొంతచెల్లినే కిరాతకంగా చంపిన 15 ఏళ్ల బాలిక
- September 05, 2022
కువైట్: అసూయతో తోడబుట్టిన చెల్లిని ఓ అక్క కిరాతకంగా హత్య చేసింది. బెని సూఫ్ గవర్నరేట్ (ఉత్తర ఈజిప్ట్)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈజిప్టు భద్రతా వర్గాల కథనం ప్రకారం.. తల్లిదండ్రులు తన కంటే చెల్లి(8)ని మెరుగ్గా చూసుకుంటున్నారని 15 ఏండ్ల బాలిక(తోబుట్టువు) భావించింది. దీంతో చెల్లిపై అసూయ పెంచుకున్న అక్క.. తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన చెల్లిని 55 సార్లు కత్తితో పొడిచి చంపింది. దీంతో బాలిక సంఘటన స్థలంలోనే చనిపోయింది. అనంతరం చనిపోయాన బాలికతోపాటు రక్తం బట్టలతో తడిసిన 15 ఏండ్ల బాలికను వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకురావడంతో విషయం పోలీసులకు చేరింది. ఈ సంఘటనపై విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ కార్యాలయానికి సూచించినట్లు పోలీసులు తెలిపారు. బాలికల తల్లిదండ్రులకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిపించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల