దుబాయ్ లో గ్లైడర్ కూలి పైలట్ మృతి
- September 05, 2022
దుబాయ్: "అమెచ్యూర్-బిల్ట్" మోటరైజ్డ్ పారాగ్లైడర్ కూలిన ఘటనలో పైలట్ మృతి చెందాడని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(GCAA) తెలిపింది. మార్గమ్‌లోని స్కైడైవ్ క్లబ్ ప్రాంతంలో పారామోటర్ ఇంజిన్‌తో నడిచే గ్లైడర్ కూలిన ఘటనలో మృతిచెందిన పైలట్ దక్షిణాఫ్రికాకు చెందినవాడని అధికారులు తెలిపారు. క్రాష్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు GCAA తెలిపింది. పారాగ్లైడర్‌లను సాధారణంగా ఎడారిలో ఎగరడానికి ఉపయోగిస్తారు. గత వారం అబుదాబిలోని షేక్ జాయెద్ మసీదు పార్కింగ్ స్థలంలో ఒక పౌర విమానం కూలిపోయిన ఘటనలో పైలట్ గాయపడ్డ విషయం తెలిసిందే. అల్ బతీన్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయడానికి వెళుతుండగా.. సాంకేతిక లోపం కారణంగా జనావాసాలు లేని ప్రాంతంలో అది కూలిపోయింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







