ఉపాధ్యాయ దినోత్స‌వం.. రాష్ట్రప‌తి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

- September 05, 2022 , by Maagulf
ఉపాధ్యాయ దినోత్స‌వం.. రాష్ట్రప‌తి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం

న్యూఢిల్లీ: రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా భార‌త ప్ర‌భుత్వం బోధ‌న‌లో ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన ఉపాధ్యాయుల‌కు జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయ అవార్డుల‌ను అంద‌జేశారు. ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో టీఎన్‌ శ్రీధర్, కందాల రామయ్య, సునీత రావు ఉన్నారు. సోమ‌వారం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో జ‌రిగిన అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో వీరు రాష్ట్రప‌తి నుంచి అవార్డులు స్వీకరించారు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన బిజెపి జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ‌.. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయుల‌కు అభినంద‌న‌లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com