చైనాలో భారీ భూకంపం.. 46 మంది మృతి
- September 05, 2022
చైనా: చైనాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ధాటికి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.25 గంటలకు భూకంపం సంభవించినట్టు చైనా భూకంప నమోదు కేంద్రాన్ని ఉటంకిస్తూ చైనా ప్రభుత్వ జిన్‌హువా ఏజెన్సీ తెలిపింది. నైరుతి చైనాలోని సిచుయాన్ రాజధాని చెంగ్డూకు నైరుతి దిక్కున 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టు తెలిపింది.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.6గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఇది సుమారు 43 కిలోమీటర్ల మేర ప్రభావం చూపిందట. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రాథమిక వార్తల ప్రకారం, సిచువాన్ ప్రావిన్స్‌లోని పలు పట్టణాల్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు తీవ్రంగా దెబ్బతినట్టు తెలుస్తోంది. పలు ఏరియాల్లో టెలి కమ్యూనికేషన్ లైన్లు తెగిపోయాయి.
రాజధాని చెంగ్డు, దానికి సమీపంలోని చాంగ్వింగ్ మెగాసిటీ సమీపంలో పలు భవంతులు కొద్ది సెకన్లు కంపించాయని చెబుతున్నారు. సహాయక చర్యల కోసం 500 మందికి పైగా సహాయ సిబ్బంది రంగంలోకి దింపారు. టిబెట్‌కు ఆనుకుని ఉన్న సిచువాన్ ప్రావిన్స్‌లో తరచు భూపంకంపాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. టిబెట్ పీఠభూమిలోనూ భూకంపాలు నమోదవుతుంటాయి.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







