హిందీలో తొలి చిత్రం: భయపెట్టేస్తానంటోన్న సమంత.!
- September 05, 2022
బాలీవుడ్లో సమంతకు బోలెడంత క్రేజ్ వుంది.ఈ క్రేజ్ అంతా కేవలం ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో వచ్చిందనే చెప్పాలి. ఇంత క్రేజ్ వున్నా, సమంత ఒక్క హిందీ సినిమాలోనూ నటించింది లేదు ఇంతవరకూ. ఆ సినిమాలో సమంతట. ఈ సినిమాలో సమంతట.. అనే వార్తలే తప్ప.
అయితే, తాజాగా సమంత తొలి హిందీ చిత్రం అనౌన్స్ అయ్యింది. ‘స్ర్తీ’ డైరెక్టర్ అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఓ ప్రయోగాత్మక చిత్రంలో సమంత నటించబోతోంది. రాజస్థాన్ జానపద నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమాలో సమంత రెండు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రలో నటించబోతోందట.
అందులో ఒకటి రాజ్‌పుత్ రాణి పాత్ర కాగా, ఇంకోటి దెయ్యం పాత్రనీ తెలుస్తోంది. భయంకరంగా ఈ దెయ్యం పాత్ర వుండబోతోందట. గతంలో సమంత, ‘రాజుగారి గది 2’ సినిమాలో ఆత్మగా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ హిందీ సినిమా కోసం ఆత్మ అవతారమెత్తబోతోందన్న మాట.
ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో సమంత బిజీగా వుంది. మరోవైపు ఓ హిందీ వెబ్ సిరీస్‌లోనూ సమంత నటిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కబోతోంది. అలాగే తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’, ‘ఖుషీ’ సినిమాలతోనూ సమంత బిజీ బిజీగా గడుపుతోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..