విమాన క్యాబిన్ నుంచి 20 కోట్ల బంగారం చోరీ..!!
- September 06, 2022
దుబాయ్: విమానంలో వెళ్లే సమయంలో ఆభరణాల వ్యాపారి బ్యాగ్ నుంచి రూ.20 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైంది. అధికారులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం దుబాయ్ నుండి కరాచీకి వెళ్లే విమానంలో పాకిస్తానీ నగల వ్యాపారి మహ్మద్ మూనిస్ ప్రయాణించాడు. ఈ క్రమంలో తన బ్యాగ్ నుంచి 1,542 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి.. విమాన సిబ్బందికి చెప్పారు. దీంతో సిబ్బంది చోరీకి గురైన బంగారం కోసం విమానమంత వెతికినా ఫలితం లేదు. విమానం కరాచీలో ల్యాండ్ అయిన తర్వాత బంగారం కోసం ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఏఎస్‌ఎఫ్) రంగంలోకి దిగి ప్రయాణికులను స్కానింగ్ చేసింది. అయినా విమానంలో చోరీకి గురైన బంగారం మాత్రం లభించలేదు. బంగారాన్ని తీసుకురావడంపై కస్టమ్స్ అధికారులకు ముందుగానే సమాచారం అందించినట్లు నగల వ్యాపారి పేర్కొన్నారు. తాను చట్టబద్ధంగా ఎగుమతి చేసిన ఆభరణాలలో సగం విలువను బంగారం రూపంలో తిరిగి తీసుకెళుతున్నట్లు.. చోరీకి గురైన బంగారం కరాచీకి చెందిన నౌరత్తన్ జ్యువెలర్స్‌కు చెందినదని సదరు వ్యాపారి తెలిపారు. మరోవైపు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుండి బయలుదేరే సమయంలోనే బంగారం దొంగతనం జరిగి ఉండవచ్చని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ సమయంలో తన బ్యాగ్ లో బంగారం ఉన్నట్లు బాధిత నగల వ్యాపారి చెబుతున్నాడు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







