లేటెస్ట్ అప్డేట్: ‘పుష్ప 2’ గురించి నోరు విప్పిన రష్మిక.!
- September 07, 2022
‘పుష్ప’ సినిమాతో శ్రీ వల్లిగా రష్మిక పేరు మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. ఇక, రేపో మాపో ‘పుష్ప 2’ సినిమా పట్టాలెక్కనుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మొదటి పార్ట్ ఇచ్చిన జోష్ అంతా ఇంతా కాదు.
దాంతో, రెండో పార్ట్‌ని చాలా జాగ్రత్తగా తెరకెక్కించాలని అనుకుంటున్నారు. లేటైనా లేటెస్టుగా వుండేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, రెండో పార్ట్ తొలి షెడ్యూల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని ఇటీవలే ‘పుష్ప 2’ టీమ్ ప్రకటించింది.
తాజాగా రష్మిక మండన్నా ‘పుష్ప 2’ కి సంబంధించి నోరు విప్పింది. ప్రస్తుతం రష్మిక మండన్నా వరుస హిందీ సినిమాలతో బిజీగా వున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, రష్మిక మండన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘గుడ్ బై’ అక్టోబర్‌లో రిలీజ్‌కి సిద్ధంగా వున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది రష్మిక.
ఈ సందర్భంగా ‘పుష్ప 2’ గురించి కూడా ఓ అప్డేట్ ఇచ్చింది. ఇటీవలే ప్రారంభమైన ‘పుష్ప 2’ ఫస్ట్ షెడ్యూల్లో రష్మిక కూడా పాల్గొనబోతోందట. మరో రెండు రోజుల్లో ‘పుష్ప 2’ టీమ్‌తో జాయిన్ అవుతా.. అని రష్మిక చెప్పింది.
మరోవైపు బాలీవుడ్లో తన తొలి చిత్రం ‘గుడ్ బై’ రిలీజ్ అవుతన్నందుకు రష్మిక మండన్నా చాలా సంతోషంగా వుంది. వీటితో పాటూ, మరో రెండు బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా చివరి దశ షూటింగ్‌కి వచ్చాయ్. తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెడతానని చెబుతోంది.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!