మత విశ్వాసాలు కించపరిచే అశ్లీల కంటెంట్ తొలగించండి....
- September 07, 2022
మత విశ్వాసాలను కించపరిచే, అశ్లీలమైన కంటెంట్ తో ప్రసారాలను నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ప్రసారం చేస్తుందని గల్ఫ్ దేశాల సమాఖ్య ఆరోపించింది. వెంటనే ఇలాంటి ప్రసారాలను నిలిపివేయాలని హెచ్చరించింది. ఐతే ప్రత్యేకంగా ఏ కంటెంట్ అన్నది మాత్రం గల్ఫ్ దేశాల సమాఖ్య ప్రకటించలేదు. సౌదీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఏక్ బరియా టీవీ లో నెట్ ఫ్లిక్స్ లో వచ్చే కంటెంట్ గురించి చర్చ జరిగింది. పిల్లలను ఉద్దేశించిన చెడు ప్రసారాలు నెట్ ఫ్లిక్స్ లో వస్తున్నాయని ఈ చర్చలో పాల్గొన్న వారు ఆరోపించారు. దీని ఆధారంగా గల్ప్ దేశాల సమాఖ్య కూడా నెట్ ఫ్లిక్స్ లో వచ్చే కంటెంట్ మీడియా నిబంధనలను ఉల్లంఘించే విధంగా ఉందని పేర్కొంది. అదే విధంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ స్వ్కిడ్ గేమ్ అనే సిరీస్ ను రెండో భాగాన్ని కూడా ప్రసారం చేయవద్దని...అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని గల్ఫ్ దేశాల సమాఖ్య హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!