‘పొన్నియన్ సెల్వన్ 1’: బాహుబలిలాగే మరో విజువల్ వండర్.!
- September 07, 2022
భారీ మల్టీ స్టారర్ చిత్రంగా రూపొందుతోన్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ 1’. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష్, శోభితా ధూళిపాళ్ల తదితర భారీ కాస్టింగ్‌తో ఈ సినిమా రూపొందుతోంది.
సీనియర్ డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్టుగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాకి రాజమౌళి ‘బాహుబలి’ చిత్రమే ఇన్సిప్రేషన్ అని ఆయన గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. బాహబలి మాదిరి, భారీ విజువల్ వండర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
వివిధ సామ్రాజ్యాలకు చెందిన రాజులు, రాణుల చరిత్రగా ఈ సినిమా కథాంశం వుండబోతోంది. తాజాగా చెన్నైలో ‘పొన్నియన్ సెల్వన్ 1’ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌లో కాస్టింగ్ అంతటికీ చోటు దక్కింది. ఆధ్యంతం ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
ప్రధానంగా చోళ సామ్రాజ్య వైభోగాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారు మణిరత్నం ఈ సినిమా ద్వారా. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళ, తదితర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ట్రైలర్‌కి వస్తున్న రెస్పాన్స్ చాలా బాగుంది. రానా వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ట్రైలర్‌లో చూపించిన పోరాట ఘట్టాలు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. చూడాలి మరి, ఆ అంచనాల్ని సినిమా అందుకుంటుందో లేదో.!
తాజా వార్తలు
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!