రౌడీ విజయ్ నెక్స్‌ట్ ఏంటీ.? ‘లైగర్’ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా.?
- September 07, 2022
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు ‘లైగర్’ తేరుకోలేని షాక్ ఇచ్చింది. భారీ అంచనాలతో ప్యాన్ ఇండియా స్థాయి సినిమాగా రూపొందిన ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని దెబ్బ కొట్టింది. దాంతో విజయ్ దేవరకొండ కెరీర్ అగమ్య గోచరంగా మారిపోయింది.
సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా తన ఆటిట్యూడే బలంగా దూసుకొచ్చాడింతవరకూ విజయ్ దేవరకొండ. కానీ, ‘లైగర్’తో ఇంతవరకూ విజయ్ దేవరకొండ సంపాదించుకున్న ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిపోయిందంటున్నారు.
సినిమా దారుణంగా నష్టాలు మిగిల్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఏం చేసినా, ఎంత చేసినా ఆ టాక్ నుంచి బయట పడలేకపోయింది ‘లైగర్’. దాంతో విజయ్ దేవరకొండ నెక్స్‌ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నాడట. అదే ‘జనగణమన’ ప్రాజెక్టు. ఇది కూడా పూరీ చేతుల్లోనే వుంది.
కానీ, ‘లైగర్’ డిజాస్టర్‌తో మరో రిస్క్ చేయాలనుకోవడం లేదట విజయ్ దేవరకొండ. ప్రస్తుతానికి ‘ఖుషీ’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ విజయ్ చేతుల్లో వున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పైనే తన ఫోకస్ అంతా పెట్టేశాడట. ‘లైగర్’ కోసం చాలా కష్టపడి కండలు కరిగించేశాడు విజయ్ దేవరకొండ. ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. రౌడీ ఫ్యాన్స్‌ని బాగా బాధిస్తోన్న విషయం ఆ ఒక్కటే.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు