ఫిఫా వరల్డ్ అతిథ్యంలో భాగంగా ఖతార్ లో మూడు కొత్త ఫైవ్ స్టార్ హోటళ్లు
- September 07, 2022
దోహా: ఫిఫా వరల్డ్ కప్ కు అతిథ్యమిస్తున్న ఖతార్ అందుకోసం గ్రాండ్ గా ఏర్పాట్లు చేస్తోంది. మిడిల్ ఈస్ట్ లో మొదటి సారి ఫిఫా వరల్డ్ కప్ జరగబోతోంది. దీన్ని కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని ఖతార్ భావిస్తోంది. పుట్ బాల్ ప్రపంచకప్ చూసేందుకు వచ్చే వారికి అదిరిపోయే అతిథ్యమిచ్చే విధంగా హోటళ్లను సిద్ధం చేస్తోంది. కేవలం ఫిఫా వరల్డ్ కప్ కోసమే కొత్త గా మూడు ఫైవ్ స్టార్ హెటల్స్ ను ప్రారంభించబోతోంది. దాదాపు 12 లక్షల మంది ఫిఫా వరల్డ్ కప్ చూసేందుకు వస్తారని ఖతార్ అంచనా వేస్తోంది. వారందరికీ అతిథ్యం ఇచ్చే విధంగా చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా కొత్త గా మూడు ఫైవ్ స్టార్ హోటల్స్ ప్రారంభించనుంది. అక్టోబర్ ఒకటి లోగా కొత్తగా నిర్మించిన మూడు ఫైవ్ స్టార్ హోటల్స్ ప్రారంభం కానున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







