రోడ్లపై నిర్మాణ వాహనాలు నిషేధం: కువైట్
- September 08, 2022
కువైట్ సిటీ: అత్యవసరమైతే తప్ప పబ్లిక్ రోడ్లపై నిర్మాణ వాహనాలను నడపకూడదని, నిర్మాణ వాహనాలను సీజ్ చేయడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించినందుకు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంటామని అంతర్గత మంత్రిత్వ శాఖ డ్రైవర్లను హెచ్చరించింది. ఇటీవలి కాలంలో కొన్ని నిర్మాణ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు గుర్తించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోడ్లు దెబ్బతినకుండా కఠిన చర్యలు చేపట్టినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేయడంతోపాటు వాటి డ్రైవర్ల లైసెన్స్‌ను సస్పెండ్ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







