దూర ప్రాంత ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త
- September 08, 2022
అమరావతి: దూర ప్రాంత ప్రయాణీకులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. ఏసీ సర్వీసులకు సంబందించిన చార్జీలను 20 శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. అమరావతి, గరుడ ఏసీ సర్వీసుల ఛార్జీలను 20 శాతం తగ్గించగా, ఇంద్ర ఏసీ సర్వీసుకు పది శాతం ఛార్జీల్లో రాయితీ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తగ్గింపు ధరలతో చూస్తే.. గుంటూరు నుంచి హైదరాబాద్ (ఎమ్జీబీఎస్)కు వెళ్ళే గరుడ ఏసీ సర్వీసు ఛార్జీ రూ. 820లు ఉండగా 20 శాతం తగ్గింపుతో రూ. 670 ఛార్జీ వసూలు చేయనున్నారు.
అలానే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనున్న గరుడ ఏసీ సర్వీసు ఛార్జీ రూ. 730 ఉండగా 20 శాతం రాయితీతో రూ. 640 వసూలు చేయనున్నారు. ఇక గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళనున్న ఇంద్ర ఏసీ సర్వీసుకు రూ. 660 ఉండగా పది శాతం తగ్గింపుతో రూ. 600లు ఛార్జీ వసూలు చేయనున్నారు. అలాగే గుంటూరు నుంచి బెంగళూరు ఇంద్ర ఏసీ సర్వీసు గతంలో రూ. 1470 కాగా పది శాతం తగ్గింపుతో రూ. 1340 వసూలు చేయనున్నారు. గుంటూరు- తిరుపతి ఇంద్ర ఏసీ సర్వీసుకు కూడా రూ. 890 ఉన్న టిక్కెట్ ఛార్జీ పది శాతం తగ్గింపుతో రూ. 810 వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇక తగ్గింపు ధరల నేపథ్యంలో ప్రయాణికుల ఆదరణ పెరిగే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!