సీఎం కేసీఆర్ పై పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం..
- September 08, 2022
హైదరాబాద్: గత కొద్దీ నెలలుగా తెలంగాణ లో వరుసగా ప్రభుత్వ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్ ఘటనలు విద్యార్థులను , వారి తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఆశ్రమాలలో , కాలేజీ హాస్టల్ లలో ఫుడ్‌పాయిజన్ జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు హాస్పటల్ పాలవ్వగా..తాజాగా వరంగల్ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ కావడంతో 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇలా వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టల్స్ లలో ఫుడ్‌పాయిజన్ అవుతున్నప్పటికీ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే పలువురు నేతలు కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేయగా..తాజాగా తెలంగాణ పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ… ‘పేద బిడ్డల వసతి గృహాలు నరకానికి ఆనవాళ్లుగా మారాయి. హాస్టళ్లలో చావు డప్పు మోగుతుంటే దేశానికే తెలంగాణ ఆదర్శమని కేసీఆర్ డప్పుకొట్టుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారూ… మీకు మానవత్వం ఉందా? ఉంటే చలించడం లేదెందుకు?’ అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







