‘ఒకే ఒక జీవితం’: శర్వా అంతలా ఏడిపించేస్తాడా.?

- September 08, 2022 , by Maagulf
‘ఒకే ఒక జీవితం’: శర్వా అంతలా ఏడిపించేస్తాడా.?

మొదట్లో శర్వానంద్ సినిమాలంటే కాస్త ఎమోషనల్ టచ్‌లోచే వుండేవి. సీరియస్ మోడ్‌లో వున్న క్యారెక్టర్స్‌కి కేరాఫ్ అ్రడస్ అనిపించుకున్నాడు శర్వానంద్. కానీ, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘రన్ రాజా రన్’ తదితర సినిమాలు శర్వానంద్‌లోని కామెడీ హీరోని బయటికి తీశాయి.
అక్కడితోనే శర్వాని అదృష్టం కూడా వరించింది. హీరోగా బాగా సెటిల్ అయ్యాడు. వరుస సక్సెస్‌లు అందుకుంటున్నాడు. తాజాగా శర్వానంద్ నుంచి వస్తున్న సినిమా ‘ఒకే ఒక జీవితం’. సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా.
రీతూ వర్మ, శర్వానంద్‌కి జోడీగా నటిస్తోన్న ఈ సినిమాలో సీనియర్ నటి అమల ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది. పెద్దగా బజ్ లేదు కానీ, సినిమా గురించి యూనిట్ సభ్యులు చాలా బాగా చెబుతున్నారు. ఎమోషనల్ డ్రామాగా సినిమాని అభివర్ణిస్తున్నారు. ఖచ్చితంగా ప్రేక్షకుడి మనసును దోచుకుంటుందనీ అంటున్నారు.
అయితే, చిత్ర యూనిట్ మాటల్ని బట్టి, సినిమాలో సెంటిమెంట్ పాళ్లు కూసింత ఎక్కువగా వుండబోతున్నాయని అర్ధమవుతోంది. అసలే ధియేటర్లకు జనాలు రావడం మానేశారు. అలాంటిది ఈ టైమ్‌లో ఇంత సెంటిమెంట్ సినిమా అంటే శర్వాకి వర్కవుట్ అవుతుందా.? అయితే, ఇదేం ఏడుపుగొట్టు సినిమా కాదనీ, ఫీల్ గుడ్ మూవీ అనీ చెబుతున్నారు. 
చూడాలి మరి, ‘ఒకే ఒక జీవితం’ శర్వాకి ఎంత మేర వర్కువుట్ అవుతుందో. ప్రేక్షకుల్ని ఎంతలా టచ్ చేయనుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com