హయ్యా కార్డ్ హోల్డర్‌లకు బంపరాఫర్

- September 10, 2022 , by Maagulf
హయ్యా కార్డ్ హోల్డర్‌లకు బంపరాఫర్

ఖతార్: మరో 72 రోజుల్లో ప్రారంభం కానున్న ఖతార్ ఫిపా ప్రపంచ కప్‌ 2022ను నిర్వహించే దిశగా విజయవంతంగా అడుగులు వేస్తోంది. నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు జరిగే టోర్నమెంట్‌కు సంబంధించిన అప్‌డేట్‌లను ఖతార్ ఆర్గనైజింగ్ కమిటీ వెల్లడిస్తూ.. ఫుట్ బాల్ అభిమానులకు అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి సన్నాహాలు చేస్తోంది. తాజాగా  ఎంట్రీ పర్మిట్‌గా పనిచేసే హయ్యా కార్డ్‌ హోల్డర్లకు బంపారఫర్ ప్రకటించింది. టిక్కెట్ హోల్డర్‌లు.. టిక్కెట్ లేని ముగ్గురు అభిమానులను ఖతార్‌కు ఆహ్వానించవచ్చని లుసైల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుప్రీం కమిటీ డైరెక్టర్ జనరల్ యాసిర్ అల్ జమాల్ ప్రకటించారు. 12 ఏళ్లు అంతకంటేఎక్కువ వయస్సు ఉన్న నాన్-టిక్కెట్ లేని అభిమానులకు కనీస ప్రవేశం ఛార్జ్ చేయబడుతుందని, 12 ఏళ్లలోపు టికెట్ లేని అభిమానులకు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదని అల్ జమాల్ తెలిపారు. ఈ సమావేశంలో ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 LLC CEO నాజర్ అల్ ఖతేర్, సేఫ్టీ & సెక్యూరిటీ ఆపరేషన్స్ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కల్నల్ జాసిమ్ అబ్దుల్రహీమ్ అల్ సయ్యద్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com