అక్కినేని హీరోలకు బాలీవుడ్‌లో పెద్ద ఝలక్కే తగిలిందిగా.!

- September 11, 2022 , by Maagulf
అక్కినేని హీరోలకు బాలీవుడ్‌లో పెద్ద ఝలక్కే తగిలిందిగా.!

అక్కినేని హీరో నాగ చైతన్య తొలిసారి బాలీవుడ్‌లో నటించిన సినిమా ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు చైతూ. చిన్న పాత్రే అయినా ఎంతో ఇష్టపడి చేసిన పాత్రగా ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాలోని తన పాత్రను అభివర్ణించుకున్నాడు చైతూ.
అలాగే, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోతో తొలి సినిమాకే నటించే ఛాన్స్ దక్కించుకోవడం కూడా తన అదృష్టంగా చెప్పుకున్నాడు చైతూ.అంతగా అంచనాలు వేసుకున్న ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. చైతూ సంగతి అలా వుంటే, నాగార్జున సంగతి ఇంకోలా వుంది.
బాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’లో నాగార్జున కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రిలీజైన ఈ సినిమాకీ బాలీవుడ్‌లో గట్టి దెబ్బ తగిలింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్ వచ్చేసింది ఈ సినిమాకి. 
దాంతో డిజాస్టర్ లిస్టులోకి పోయింది ఈ సినిమా. ఇద్దరు అక్కినేని హీరోలూ బాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ చూడడంతో, యాంటీ అక్కినేని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. 
ఇక, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకి తెలుగు నుంచి స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శక దిగ్గజం రాజమౌళితో పాటూ ఎన్టీయార్ సైతం చేయందించినా పరిస్థితులు అనుకూలించలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్‌ని అడ్డుకోలేకపోయారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com