పవన్ సినిమాకి ఆ రూమర్లన్నీ వుత్తదే.!

- September 11, 2022 , by Maagulf
పవన్ సినిమాకి ఆ రూమర్లన్నీ వుత్తదే.!

పవన్ కళ్యాణ్‌తో తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన సముద్ర ఖని ఓ సినిమా తెరకెక్కించాల్సి వుంది. తమిళంలో సముద్ర ఖని నటించి డైరెక్ట్ చేసిన సినిమా అది. ‘వినోదయసితం’ అనే టైటిల్‌తో రూపొంది, సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 
చిన్న సినిమాగా తెరకెక్కి, ఘన విజయం అందుకున్న సినిమాగా ఈ సినిమా పేరు తెచ్చుకుంది. ఈ సినిమానే తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా భారీగా తెరకెక్కించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ సినిమాకి సముద్ర ఖనియే డైరెక్ట్ చేయనున్నాడు. 
కేవలం 21 రోజులు మాత్రమే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ టైమ్ కేటాయించారు. సో, అతి తక్కువ టైమ్‌లోనే ఈ సినిమాని పూర్తి చేసేయనున్నారన్న మాట. తెలుగు వెర్షన్ కోసం, పవన్ ఇమేజ్‌కి తగ్గట్లుగా ఈ సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేశారట. 
అయితే, ఈ సినిమా ఆగిపోయిందనీ, ఈ సినిమాకి దర్శకత్వంలో కొన్ని సలహాలూ, సూచనలు ఇవ్వాల్సిన త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ సినిమాతో బిజీ అయిపోవడం వల్ల, ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. 
అంతేకాదు, ‘హరి హర వీరమల్లు’ సినిమా ఓ పక్క, రాజకీయాలు ఇంకో పక్క.. పవన్ కళ్యాణ్ బిజీ అయిపోవడం కూడా ఈ సినిమా ఆగిపోవడానికి కారణం అంటున్నారు. అయితే, సినిమా ఆగిపోలేదనీ, కాస్త ఆలస్యం అవుతుందంతే.. అని పవన్ కళ్యాణ్ అత్యంత సన్నిహిత వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com